మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐని సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ ముదిరాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ లో పోస్టులు పెట్టాడు. దీంతో మహబూబ్ నగర్ సీఐ అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, బెల్టుతో కొట్టాడు. ఉదయం 5 గంటలకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని తెలిసి ఆఘమేఘాల మీద మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ముందు అతన్ని బైండోవర్ చేసి వదిలిపెట్టారు. బాధుతన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో పరామర్శించారు. బుధవారం పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.