Saturday, November 2, 2024

కాంగ్రెస్ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతడు!

Must Read

కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతాడని ఆరోపించారు. స్వయాన కాంగ్రెస్ నేతలే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్లు ముట్టుకోడని… లిక్కరే తాగుతాడని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పోలీసుల భయం పట్టుకుందని.. అందుకే స్పెషల్ పోలీసులకు భయపడి, వాళ్లని తీసేసి ఆర్మ్‌డ్‌ పోలీసులను పెట్టుకున్నాడని విమర్శించారు. రేపు ఆర్మ్‌డ్‌ పోలీసులకు కూడా భయపడితే, చంద్రబాబు నాయుడిని అడిగి ఆంధ్ర పోలీసులను తెచ్చుకుంటావా? అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్.. కేంద్ర సహాయ మంత్రి అని మర్చిపోయి, కేవలం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయాడని విమర్శించారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కుతూ, రేవంత్ రెడ్డికి రక్షణగా ఉంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్ం పత్తిని, వరి ధాన్యాన్ని కొనకుండా.. దళారులతో కుమ్మక్కై తెలంగాణ రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అభివృద్ధి పనులు చేయకుండా తమ జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, ఆటో కార్మికుల భత్యం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

త్వరలో పాదయాత్ర చేస్తా!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -