Wednesday, November 12, 2025

నేటి నుంచి కాకినాడ‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Must Read

దేశ సేవ చేయాలనే యువతకు గొప్ప అవకాశం ల‌భించింది. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) మైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నేడు ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాలకు చెందిన యువత ఇందులో పాల్గొంటున్నారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన 15 వేల మంది అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరుకానున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగుతో పాటు మెడికల్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, లాంగ్ జంప్, ఫుల్ ఆప్స్, నైన్ ఫీట్ డిచ్, జిగ్‌జాగ్ ఈవెంట్లను ఆర్మీ నిర్వహించనుంది. అభ్యర్థుల సౌకర్యార్థం కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -