Thursday, November 13, 2025

నేడు ఈడీ ముందుకు అనిల్‌ అంబానీ

Must Read

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై ఆర్థిక నేరాల విభాగం (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. రూ.17 వేల కోట్ల రుణ మోసానికి సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అంబానీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆగస్టు 1న ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వారం రిలయన్స్‌ గ్రూప్‌కి చెందిన 50 కంపెనీలు, 25 మందికి సంబంధించిన ముంబైలోని 35 చోట్ల ఈడీ దాడులు జరిపింది. ఈ దర్యాప్తు సీబీఐ దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా కొనసాగుతోంది. రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లాంటి అనిల్‌ అంబానీకి చెందిన సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాల వినియోగంపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీ కారు బాంబు దాడిపై పాక్ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -