నిమ్మకాయతో ఎన్ని ప్రయోజనాలో
నిమ్మకాయలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు గ్లూకోజ్ ను శరీరానికి అందిస్తుంది. నిమ్మకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నిమ్మకాయ శాస్త్రీయ నామం సిట్రస్ లిమోన్. నిమ్మకాయ చెట్లను భారత దేశంతో పాటు జపాన్, మెక్సికో, మొరాకో, గ్రీస్, అల్జీరియా, ఆఫ్రికా, ఈజిప్టు దేశాల్లో సాగుచేస్తారు. నిమ్మకాయలులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించడంలో నిమ్మకాయ ఎంతో మేలు చేస్తుంది.
అధిక బరువు తగ్గాలంటే
నిమ్మకాయను వేడి నీటిలో కలుపుకుని తాగితే అధిక బరువును తగ్గిస్తుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టులో చుండ్రు సమస్య తగ్గించేందుకు, చర్మం కాంతివంతంగా చేసేందుకు నిమ్మకాయ ఉపయోగపడుతుంది. వీటితో పాటు నిమ్మకాయ అలర్జీ సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మకాయ వల్ల రక్తహీనత తగ్గుతుంది. నిమ్మకాయతో కాలేయం గాయాలు తగ్గుతాయి.
కిడ్నీలో రాళ్లు నివారణకు
కిడ్నీలలో రాళ్లు నివారించడంలోనూ నిమ్మకాయ నీటిని తాగుతారు. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎక్కువగా నిమ్మరసం తాగుతారు. నిమ్మరసంతో డీహైడ్రేషన్ కాకుండా గ్లూకోజ్ ను పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు
నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఎసీడీటీ సమస్య రావచ్చు. కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, వికారం వంటివి కలుగుతాయి. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే నోటిలో పొక్కులు, బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. దంత సమస్యలతో పాటు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.