సీతను తీసుకెళ్లాలంటే.. రావణాసురుడ్ని దాటాలంటున్న మాస్ మహారాజా!
మాస్ మహారాజా రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకొస్తున్నాడు. ఇటీవల ‘ధమాకా’తో రూ.100 కోట్ల కబ్బులోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు అంతకుమించిన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’ టీజర్ తాజాగా విడుదలై వైరల్ అవుతోంది.
‘రావణాసుర’లో తనను లక్ష్యంగా చేసుకున్న వారిని వరుసగా అంతం చేస్తూ పోయే వ్యక్తిగా రవితేజ కనిపిస్తున్నాడు. ఆయన చంపే తీరు క్రూరంగా ఉంటుంది. ‘సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడ్ని దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ టీజర్లో హైలైట్గా నిలిచాయి. ఈ మూవీలో రవితేజ పక్కన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ ఫిల్మ్.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.