Friday, April 10, 2026

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్!

Must Read

చిల్లర ప్రయత్నాలు చేస్తే కోర్టుకెళ్తా.. ‘బలగం’ కాంట్రవర్సీపై వేణు ఫైర్!

తెలంగాణ నేపథ్యంతో వచ్చే సినిమాలు ఈమధ్య పెరుగుతున్నాయి. తెలంగాణ నేటివిటీతో పాటు ఇక్కడి మాండలికానికి కూడా టాలీవుడ్​ మూవీల్లో ప్రాధాన్యత పెరగుతోంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ‘బలగం’ మూవీ మంచి ఆదరణను పొందుతోంది. తెలంగాణ పల్లె నేపథ్యంతో అల్లుకున్న కథ, నేటివిటీ, మాండలికం, ఆ డైలాగులు, చక్కటి సంగీతం ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో ఈ చిత్రం పాజిటివ్​ టాక్​తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాపై ఓ వివాదం చెలరేగుతోంది. గడ్డం సతీష్ అనే వ్యక్తి ఈ మూవీ స్టోరీ తనదేనని ఆరోపించారు.

ఈ కాంట్రవర్సీపై డైరెక్టర్ వేణు స్పందించారు. ‘బలగం’ కథ తన కుటుంబంలో జరిగినదని ఆయన అన్నారు. ‘మా నాన్న చనిపోయినప్పుడు మెదిలిన కథే ‘బలగం’. కాకి ముట్టుడు అనేది తెలంగాణ కల్చర్ కాదు.. ఇది తెలుగు సంప్రదాయం. నా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం ప్రోత్సాహంతో ఈ స్టోరీని మలిచా. గడ్డం సతీష్ రాసిన కథ నేను ఇంకా చదవలేదు. పిట్ట ముట్టుడు సంప్రదాయం ఎవరి సొత్తూ కాదు. దిల్ రాజు బొమ్మను ఉపయోగించి సతీష్ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు’ అని వేణు స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను కోర్టుకు ఆశ్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -