Sunday, May 31, 2026

సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింది – యాంక‌ర్ ఉద‌య‌భాను

Must Read

సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను సినీ ప‌రిశ్ర‌మ‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో సిండికేట్ పెరిగింద‌ని ఆమె పేర్కొన్నారు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించించారు.సినీ పరిశ్రమలో యాంక‌ర్ల‌కు అవకాశాలపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవెంట్‌లో ఉద‌య‌భాను మాట్లాడుతూ… “ఇదొక్కటే చేశాను, మళ్లీ చేస్తానన్న నమ్మకం లేదు. కార్యక్రమం మన చేతిలో ఉండదు, అంత పెద్ద సిండికేట్ ఎదిగింది” అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పరిశ్రమలో కుట్రలు ఉన్నాయంటూ ఆమె ఆరోప‌ణ‌లు చేశారు. కాగా, ప్ర‌స్తుత కాలంలో ఆమె అడ‌పాద‌డ‌పా ఈవెంట్లు చేస్తున్నా పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉద‌య‌భాను చేసిన వ్యాఖ్య‌లు వైరల్‌గా మారాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -