Saturday, February 15, 2025

వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ

Must Read

స్టార్ యాంకర్‌ సుమ కనకాలకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది. అయితే, సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీ తో వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకున్న సుమ తాజాగా ‘ప్రేమంటే’ చిత్రంతో మరోసారి అలరించబోతోంది. ఆదివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ టీం ఫోటోలు షేర్ చేస్తూ చిత్రంపై అధికారికంగా ప్రకటన ఇచ్చింది.

ఈ పూజ కార్యక్రమానికి స్టార్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, హీరో రానాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాగా, రానా ముహుర్తపు సన్నివేశానికి ఫస్ట్‌ క్లాప్‌ కొట్టగా.. సందీప్‌ రెడ్డి వంగా కెమెరా స్విచ్చాన్ చేశారు. థ్రిలింగ్ అండ్ రోమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమెడియన్‌ ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇందులో సుమ పాత్ర కీలకంగా ఉండబోతుందట.ఈ మూవీతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -