పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో గడ్డి మందు కొట్టించడంతో 51 విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన దగ్గుతో పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మందిని కరీంనగర్ కు తరలించారు. కాగా, పాఠశాల ఆవరణలో గడ్డిని తొలగించేందుకు మందును పిచికారి చేశారని.....
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఇది ఫేక్ అని తేల్చారు. ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు...
– నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన
హైదరాబాద్ లో మూసీని ప్రక్షాళన చేసి మరో సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతామని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు....
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. భారీగా టెండర్లు జరిగాయి. దీంతో బెల్టు షాపులు సైతం రెట్టింపయ్యాయి. ఎక్కడ చూసినా మందు బాటిళ్లే కనిపిస్తున్నాయి. తాజాగా పలు సంతల్లో లిక్కర్ బాటిళ్లను టేబుల్ పై పెట్టి, అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కడ...
కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి రోజుకు రెండు ఫుల్లు బాటిల్లు తాగుతాడని ఆరోపించారు. స్వయాన కాంగ్రెస్ నేతలే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ మంత్రి అమెరికాకు వెళ్తే ఉదయం లేచినప్పటి నుంచి మంచి నీళ్లు ముట్టుకోడని…...
వచ్చే నెల 11న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అధికారులు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. ఈసారి ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రజలపై భారం పడకుండా రాబడి తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమాత్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కలిసి పనిచేస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.
సీనియర్ నటుడు బాబు మోహన్ తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం టీడీపీ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరిన బాబు మోహన్.. 1999లో చంద్రబాబు హయాంలో అందోల్ నుంచి విజయం సాధించి, మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అక్కడి నుంచి బీజేపీకి వెళ్లారు....
అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో భేటీ అయ్యారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి ఎదిగారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ గా పనిచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్...
కేటీఆర్ బావమరిది పాకాల రాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫామ్ హౌజ్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కానీ, పోలీసులకు విచారణకు పాకాల రాజు హాజరుకావాలని సూచించింది.కాగా, జన్వాడలోని పాకాల ఫామ్ హౌజ్ లో మద్దూరి విజయ్ డ్రగ్స్ వాడారని తేలడంతో పాకాల రాజును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, రాజు...