భారత్‌లో HMPV వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో నాలుగు HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు HMPV వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండేళ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది....
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ విడులైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1,831 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ కలెక్షన్స్ (రూ.1810 కోట్లు) రికార్డును పుప్ప-2 బ్రేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘పుష్ప-2’ సినిమా రెండో...
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా మావోయిస్టుల ఘతుకానికి 10 మంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. 8 మందికి తీవ్రగాయాలవ్వగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం...
చిన్నారుల కోసం టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ‘చిన్నారులంతా ఫోన్లు, టాబ్‌లకు, టీవీలకు అతుక్కుపోతున్నారని, అన్నం తినాలన్నా ఫోన్ ఉంటేనే తింటున్నారని, తల్లిగా నాకు ఆ సమస్య తెలుసు’ అని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. ‘సీసా స్పేసెస్’తో కలిసి సానియా ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ఈవెంట్‌కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ రెండు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. 'ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన...
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు మూడు వేల పోస్టుల భర్తీ జరగనుందట. గ్రూప్-1 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు...
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ కారు కేసులో ఏసీబీ విచారణకు వెళ్లిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుదిరిగారు. విచారణకు తన తరఫు లాయర్లను అనుమతించకపోవడంతో కేటీఆర్ వెళ్లిపోయారు. తన అడ్వకేట్లను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. లాయర్లు వస్తే ఇబ్బంది ఏంటని పోలీసులను కేటీఆర్ నిలదీశారు. అనంతరం...
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బిహార్‌లోని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గత నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిశోర్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి.....
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘2024లో టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సగటు కేవలం 15. కోహ్లీకి బదులుగా ఒక యువ ఆటగాడికి రెగ్యులర్‌గా అవకాశాలు ఇస్తే అతను కూడా సగటున 25-30 పరుగులు చేస్తాడు. ఎందుకంటే మనం ఇక్కడ జట్టు గురించే...
తన తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావడంపై నటి రేణూ దేశాయ్ స్పందించారు. ‘నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు...