Wednesday, November 12, 2025

అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం!

Must Read

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఆనందకర ఘడియలు నెలకొన్నాయి. సచిన్ కొడుకు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగినట్లు అధికారికంగా ధృవీకరించారు. కొద్దికాలంగా అర్జున్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, సచిన్ స్వయంగా అభిమానులతో ముచ్చటిస్తూ నిశ్చితార్థ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 14న అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు కావడం విశేషం. ఈ శుభవార్తతో టెండూల్కర్ కుటుంబ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -