Thursday, October 8, 2026

నానా పటేకర్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

Must Read

ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో నానా పటేకర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుని తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడిగా ఆయనను కొనియాడారు. నానా పటేకర్ మరణంతో సినీ పరిశ్రమ ఒక విలక్షణ కళాకారుడిని కోల్పోయిందని అన్నారు.

నానా పటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా నానా పటేకర్ గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబుది మోస‌మే – ధర్మాన ప్రసాదరావు

విశాఖలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన పేరుతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు, తమ్మినేని సీతారాం,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -