Thursday, October 8, 2026

బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబుది మోస‌మే – ధర్మాన ప్రసాదరావు

Must Read

విశాఖలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీ గర్జన పేరుతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణు, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు సహా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 24 శాతానికి పరిమితం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని నేతలు ఆరోపించారు. బీసీలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని విమర్శించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి రాజకీయ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని చెల్లుబోయిన వేణు ఆరోపించారు.

టీడీపీ బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ వర్గానికి చేసిన మేలు ఏమీ లేదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. బీసీలకు న్యాయం చేసిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, భారీగా పెరుగుతున్న అప్పులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్తుంటే ఆ వర్గానికి చెందిన ప్రజలు సాధారణ ఉద్యోగాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలతో రాజధాని ప్రాంతం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొందని విమర్శించిన ధర్మాన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నానా పటేకర్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ రంగంలో నానా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -