Sunday, October 18, 2026

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

Must Read

యూజర్ల కోసం ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్‌ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా తన బ్లాగ్‌ పోస్ట్‌లో పంచుకుంది. స్టేటస్‌ పెట్టే సమయంలో ఫేస్‌‌బుక్ స్టోరీ, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అని రెండు ఆప్షన్లు కనిపించనున్నాయి. వాటిని ఎనేబల్‌ చేసుకొని ఈ సదుపాయం పొందొచ్చు. ఒక వేళ వద్దనుకుంటే డిసేబుల్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ని వాట్సప్‌ ప్రపంచవ్యాప్తంగా తీసుకురానుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అవతార్స్‌, మెటా ఏఐ స్టిక్కర్స్‌.. ఇలా కొత్త ఫీచర్లు కూడా వాట్సప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -