Friday, May 22, 2026

కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌!

Must Read

రాహుల్ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప‌డింది.దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.

ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్ ప్ర‌క‌టించింది.

ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ ప్రకట‌న విడుద‌ల చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన పార్లమెంటుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హజరయ్యారు.

మ‌రోవైపు, రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియా గాంధీ రిటైర్డుమెంట్ ప్ర‌క‌టించారు. గత పాతికేళ్లలో పార్టీలో ఆమె ఎన్నో విజయాలను సాధించింది. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువ‌చ్చింది.

ఆ త‌రువాత పార్టీ బాధ్య‌త‌లు త‌న కుమారుడు రాహుల్‌కు అప్ప‌గించాల‌ని భావించ‌గా ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దేశంలో మోదీ హావా కొన‌సాగుతుండ‌గా మ‌రో ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌. కాంగ్రెస్ భ‌విష్య‌త్ ఎలా ఉంటుందోన‌ని ఆ పార్టీ శ్రేణులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి మ‌రి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -