మెగా ఇంట్లో మరో డివోర్స్ అంటూ రూమర్స్.. ఇందులో నిజమెంత?
మెగాస్టార్ కుటుంబంలో జరిగే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సినీ, రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ కావడంతో స్వతహాగా వారి ప్రొఫెషన్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ పైనా అందరికీ ఎడతెగని ఆసక్తి ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి మెగా హౌస్లో ఏం జరుగుతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మెగా డాటర్ నిహారిక వైవాహిక జీవితానికి సంబంధించిన పుకార్లు ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి.
Must Read: ఇల్లు కూడా అమ్ముకున్నా.. నా కష్టాలు పగవాడికీ రాకూడదు: మోహన్ బాబు
మెగా కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతున్నట్లే అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆ ఫ్యామిలీలో వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కూడా పెళ్లిళ్ల విషయంలో అపఖ్యాతి పాలయ్యారు. ఇప్పుడు నాగబాబు ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతోందని రూమర్స్ గుప్పుమంటున్నాయి. నాగబాబు కుమార్తె నిహారిక, ఆయన అల్లుడు చైతన్యల మధ్య ఏదో జరుగుతోందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
చైతన్య-నిహారికల పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగిందో అందరికీ తెలిసిందే. నిహారిక హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించినా అంతగా సక్సెస్ కాలేదు. పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఆమె కెరీర్ పరంగా బిజీబిజీ అవుతున్నారు. ఆమెకు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ సమయంలో చైతూ-నిహారిక విడిపోయారనే వార్తలు సంచలనంగా మారాయి.
అందులో నిజమెంత?
చైతన్య-నిహారిక విషయంలో గాసిప్స్ రావడం ఇది కొత్త కాదు. చాన్నాళ్లుగా ఈ వార్తలు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నవే. కొంతకాలంగా నిహారిక చాలా సైలంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో హడావుడి చేసే ఆమె అక్కడా మౌనంగానే ఉంటున్నారు. మెగా ఫ్యామిలీ ఫొటోల్లో చైతన్య ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా వినిపిస్తోంది ఏంటంటే.. ఈ ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరిని మరొకరు అన్ ఫాలో అయ్యారని. చైతన్య తన ఖాతాలో నుంచి పాత ఫొటొలు తీసేశారని సమాచారం.
Must Read: ఏమే పిల్లా.. పెళ్లి చేసుకోవే అంటాడు: సింగర్ కౌసల్య
క్లారిటీ ఇస్తారా?
చైతన్య-నిహారిక విషయంలో ఏదో ఒక క్లారిటీకి రాకుండా ఓ నిర్ణయానికి వచ్చేయడం సబబు కాదు. కానీ ఏదో ఉందనిపిస్తోందని నెటిజన్స్ అంటున్నారు. నాగబాబు ఈ సంవత్సరం వరుణ్ తేజ్ మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారని కూడా న్యూస్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకుంటారని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ వార్తలను ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు.. అలాగని ఖండించనూ లేదు. మొత్తానికి మెగా బ్రదర్ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. నిజానిజాలు కొన్నాళ్ల తర్వాత కానీ బయటకు రాకపోవచ్చు.