Sunday, November 29, 2026

రాష్ట్రం రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా – హరీశ్ రావు

Must Read

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించిన ఆయన సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ వేదికగానే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలన్నా ప్రజలకు సంక్షేమం అందాలన్నా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

850 మంది ఎంపీలతో లోక్ సభ సాధ్యమేనా – శశి థరూర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -