Monday, October 20, 2025

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో హైఅలర్ట్‌

Must Read

మావోయిస్టు పార్టీ వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు హైఅలర్ట్ ప్ర‌క‌టించాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఈ వారోత్సవాల సందర్భంగా పోలీసు విభాగం అప్రమత్తమైంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ప్రత్యేక బలగాలు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి, వారి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల మేరకు మావోయిస్టులు ఈ వారోత్సవాలను తమ సాంస్కృతిక, రాజకీయ వ్యూహాల కోసం ఉపయోగించుకునే అవకాశముందని భావించి అన్ని శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టారు. పల్లెలలో క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది తిరుగుతూ స్థానికుల సహకారం తీసుకుంటూ సర్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అపరిచితులను గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -