Wednesday, October 22, 2025

పహల్గామ్ మృతుల‌కు సీఎం రేవంత్ నివాళి

Must Read

కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్ర‌దాడిలో మృతి చెందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెండు నిమిషాల మౌనం పాటించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో గురువారం ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ జరగనుంది. మృతుల ఆత్మకు శాంతి కలిగిలా కొవ్వుతులతో ఈ ర్యాలీలో నివాళులర్పించనున్నారు. సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -