యూట్యూబ్ లో డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన హర్షసాయిపై పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు ఫైల్ అయింది. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగికంగా వాడుకోవడమే కాక తన వద్ద రూ.2కోట్లు తీసుకుని, ముఖం చాటేశాడని కంప్లయింట్ చేసింది. తన పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడని కూడా తెలిపింది. దీంతో నార్సింగి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హర్షసాయి కోసం గాలిస్తున్నారు.
ఏ తప్పూ చేయలేదు: హర్షసాయి
తనపై నమోదైన కేసుపై హర్షసాయి ఇన్ స్టా వేదికగా స్పందించాడు. కేవలం డబ్బుల కోసమే ఆమె కేసులు పెట్టిందని, తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ఈ విషయంపై లీగల్ సలహాలు తీసుకుంటున్నానని, త్వరలో నిజాలు బయటకు వస్తాయన్నారు. తన క్యారెక్టర్ ఏంటో ఫాలోవర్స్ కి తెలుసు అని వివరించాడు.