మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.