Wednesday, November 19, 2025

#todaybharat

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు భారీ నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిన్ భవనం వద్ద జరిగిన నిరసనలో కార్మిక నాయకులు...

సౌదీ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమై మరణించిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. మృతుల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతాత్మలకు...

విజయవాడలో గంజాయి మాఫియా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్, వాగు సెంటర్, పంజా సెంటర్, శ్రీనివాస మహల్, సాయిరాం థియేటర్, రైల్వే యార్డ్ ప్రాంతాల్లో గంజాయి సేవ బహిరంగంగా జరుగుతోంది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నప్పటికీ చర్యలు లేవని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ను ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులు, బండ్ల సీటు కవర్లు...

తెలంగాణ‌ స్థానిక సంస్థల ఎన్నికల‌పై కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

సౌదీ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని తక్షణమే సౌదీకి పంపించాలని ఆదేశించింది. మృతదేహాలను మత సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా...

కాగ్ నివేదికతో చంద్ర‌బాబుపై జ‌గ‌న్‌ విమర్శలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలకు విరుద్ధంగా రాష్ట్ర ఆర్థికం కుదేలైందని ఆరోపించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలోని గణాంకాలను ఆధారంగా చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక...

బాలయ్య జోలికొస్తే చర్మం ఒలిచేస్తామ‌ని ఎమ్మెల్యే వార్నింగ్‌

హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నానని పేర్కొన్న ఆయన, ఆయన జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామని, ఇదే హెచ్చరిక మీ అధినేతకు...

వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నా: సాయి ధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది తన వివాహం జరుగుతుందని ప్రకటించారు. మంచి సినిమాలు, జీవితం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని, కొత్త సంవత్సరంలో ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నానని అన్నారు. రాబోయే చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’పై మంచి నమ్మకం...

నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం నేడు విచారణ చేపడతుంది. బీఆర్‌ఎస్ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జులై 31న ఆదేశించినప్పటికీ ఆలస్యమవుతోందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. స్పీకర్ మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల...

గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని...
- Advertisement -spot_img

Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -spot_img