కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా శనివారం బీసీ బంద్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందని చెప్పారు. జాగృతి కార్యకర్తలు బంద్ లో పాల్గొంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో చట్టం చేసే...
బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. బంద్ మద్దతుగా అఖిలపక్ష బీసీ సంఘాలు హైదరాబాద్ లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్ పై అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీ ఐకాస చైర్మన్ ఆర్...
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మనోజ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో మౌనిక గౌరవనీయ డీజీపీ శివధర్ రెడ్డిని...
ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని అన్నారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల...
తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించినట్లు తెలిసింది.కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గట్టి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ...
తెలంగాణలో రైతులు నూనె గింజలు మరియు ఆయిల్‌పామ్ పంటల సాగును పెంచాలని, ఈ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు, జాతీయ నూనె గింజల పథకం కింద 2025-26 సంవత్సరానికి...
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నడుస్తున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు ఆయన తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు గ్రామాల బయట మాత్రమే షాపులు పెట్టాలని, సిట్టింగ్ సౌకర్యాలు...
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్, మధుసత్యం గౌడ్, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో...
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...