తెలంగాణతో విభేదాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నేను. అదేలా అమరావతిని కూడా అభివృద్ధి చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలూ వినియోగించుకుంటున్న నేపథ్యంలో, ప్రధాని మోదీ నదుల అనుసంధానాన్ని ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు....
ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నిర్వాహక విభజన, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రెండు...
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా లేదని, ప్రభుత్వ పరిపాలన స్థానంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పని చేస్తోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం చంద్రబాబుపై...
బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాకిచ్చింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరగబోయే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ముందుగా పంపిన సింగిల్ ఎజెండా ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉదయం కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీలో చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హోంమంత్రి అమిత్ షాతో ఆయన మొదటి సమావేశం జరగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం...
వైసీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, వైయస్ జగన్ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. జన సందోహాన్ని అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై వైయస్ జగన్ మండిపడ్డారు. పోలీసుల లాఠీ చార్జ్ లో చంద్రగిరి యువజన విభాగం...
ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఇటీవల గుంటూరులో వైసీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో...
ఏపీలో యోగా టీచర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా...
సోషల్ మీడియాలో వేధింపులకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా హైకోర్టు జడ్జికి సైతం వేధింపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోషల్...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...