Sunday, December 7, 2025

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రులతో కీలక భేటీలు

Must Read

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన కోసం మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఆయన ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి 11.45కి ఢిల్లీలో చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు హోంమంత్రి అమిత్ షాతో ఆయన మొదటి సమావేశం జరగనుంది. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్‌తో మేట్రో ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 3.30కి పీవీ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంట‌ల‌కు ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు.జూలై 16న‌ కార్మికశాఖ మంత్రి మాండవీయతో సమావేశమవుతారు. అనంతరం జలశక్తి మంత్రి పాటిల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి బనకచర్లపై చర్చించనున్నారు. చివరగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అనంతరం జూలై 17న అమరావతికి తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -