Thursday, November 13, 2025

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!

Must Read

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!

గాయంతో కొన్నాళ్లు భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగి టీమిండియాకు తాను ఎంత కీలకమో నిరూపించాడు. అయితే ఇంత రాణించిన జడ్డూ.. ఓ ప్రతిష్టాత్మక అవార్డును కొద్దిలో మిస్సయ్యాడు.

2023, ఫిబ్రవరి నెలకు గానూ పురుషుల ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును ఇంగ్లండ్ అప్కమింగ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. మూడు నెలల వ్యవధిలో ఈ అవార్డును రెండోసారి సొంతం చేసుకున్నాడు బ్రూక్. ఈ పురస్కారానికి జడేజా, వెస్టిండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ నుంచి బ్రూక్కు తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా అతడ్నే వరించింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో ఆడిన రెండు టెస్టుల్లో బ్రూక్ రెండు అర్ధ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదాడు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -