సున్నిత మనస్థత్వమే దీనికి కారణమా
పదో తరగతి, ఇంటర్ ఫలితాలు వెళ్లడించగానే ఆత్మహత్యలు
పాఠశాలలు, కళాశాల్లో వేదింపులతో కొందరు
మందలించాలంటేనే భయపడుతున్న తల్లి తండ్రులు
ఏమైందీ నగరానికి ఓ వైపు ఆత్మహత్యలు…మరో వైపు వింత పోకడలు..అవును ఇదేదో సినిమాలో వచ్చిన యాడ్ కాదు. ప్రస్తుత కాలంలో ఎదుగుతున్న యువతరంపై పడుతున్న ఇబ్బందులు. చిన్న చిన్న విషయాలను కూడా సహించలేని యువతరం జీవితాన్నే కోల్పోవడం విడ్డూరంగా మారింది. అమ్మ ఫోన్ చూడొద్దని చెప్పిందని ఓ పిల్లాడి ఆత్మహత్య, సెల్ ఫోన్ లో గేమ్ ఆడొద్దని మందలించినందుకు యువకుడు ఆత్మహత్య. విద్యార్థులను కళాశాలలో మందలించారని యువతి ఆత్మహత్య..స్నేహితులతో గొడవలై యువతి ఆత్మహత్య..పరీక్షల్లో ఫేయిల్ అయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని యువతి, యువకులు ఆత్మహత్య..ఇలా ఎన్నో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత యుగంలో పిల్లలను మందలించడానికే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరిని ఏం అంటే అది ఏ వైపు దారి తీస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే అనిపిస్తోంది..ఆరోజులే బాగున్నాయని, ఈ సెల్ ఫోన్ యుగంలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడానికి కొని తెచ్చుకుంటున్నారని.