నా పేరు రాజేష్. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు. అప్పుడప్పుడే స్కూల్ కు వెలుతున్న రోజులవి. టీచర్ లు అ..ఆ..అని పలక మీద దిద్దిస్తే వాటిని బలపంతో చదువుతూ దిద్దుతున్నాను. వెంటనే నా పక్కన ఉన్న రాము గాడు బయటికి వెల్దంరా అన్నాడు. మరి టీచర్ పంపించదు కదరా అంటే టాయిలెట్ అర్జెంట్ అని చెప్పు పంపిస్తారు అన్నాడు. వెంటనే ఇద్దరం టాయిలెట్ అని లేచాం. మేడం ఇద్దరికీ ఒకేసారి ఎంట్రా ఒకరి వెళ్లొచ్చాక మరొకరు వెళ్లండి అని చెప్పింది టీచర్.
నేను వెంటనే తడిచిపోయింది అని నా లాగులో రెండు డ్రాప్స్ పోసేశాను. అది చూసిన వెంటనే టీచర్ అసె ఇద్దరు వెళ్లండి అని పంపించింది. ఇద్దరం ఏం చక్కా పయటకు వెళ్లి చెరి పావలా పాపుడాలు కొనుక్కుని తిన్నాం. అప్పటికే బెల్ మోగడంతో అందరూ బయటకు వచ్చారు. రోడ్డు పక్కన అందరూ పాస్ చేస్తుండగా రాజు గాడు పక్కనే ఉన్న కుంటలో పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి మా రాజుని బయటకు తీశాడు.
సార్ సమాచారం తెలుసుకుని అందరినీ వరుస క్రమంలో నిలుచోబెట్టి అందరికీ రెండు దెబ్బలు కర్రతో వడ్డించాడు. ఇప్పటికీ నాకు అర్థం కాదు మా సార్ ఎందుకు అందరినీ కొట్టాడో…ఆ స్కూల్ లో అ..ఆ..లు నేర్చుకుని అక్కడి నుంచి సర్కారు బడికి వెళ్లాను. సదువు సక్కగ రావాలని మా ఊరిలోని ఓ ప్రయివేటు స్కూల్ లోకి పంపాడు మా నాన్న. కానీ అక్కడ నాకు ఇంకో వ్యక్తికి గొడవ కావడంతో వెంటనే మా మండలంలోని ఓ ప్రయివేటు స్కూల్ కి పంపించాడు మా నాన్న. అంతా కొత్త. రోజూ రెండు ఊర్ల జనాబాని తోలుకుని వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం, పెద్ద స్కూల్ అంతా కొత్తగా..భయం..భయంగా సాగిపోయేది జీవితం..(పార్ట్ 2)