కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం డీఎస్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.