తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఇక నుంచి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అదనపు లడ్డూల తయారీకి చర్యలు తీసుకుంటోంది. లడ్డూల పంపిణీకి అదనంగా సిబ్బందిని కూడా నియమిస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. తమ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలు తీసుకెళ్తారు. దీంతో భక్తులకు సరిపడా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి, తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో శ్రీవారి లడ్డూలను టీటీడీ పంపిణీ చేస్తోంది.