Sunday, June 15, 2025

కేటీఆర్ పరువు నష్టం కేసు.. కొండా సురేఖకు మొట్టికాయలు

Must Read

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు మండిపడింది. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయగా.. సోమవారం విచారణ చేపట్టింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ బాధ్యత గల మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు ఆదేశించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -