తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చినట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియగా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు.