రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శంకుస్థాపన చేశారు. రూ.94.44 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ పర్యాటకులను మరింత ఆకర్షిస్తుందని పాలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రాజమండ్రి వద్ద గోదావరిపై పాత రైల్వే వంతెనను అభివృద్ధి చేయనున్నారు.కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌పై సర్వత్రా చర్చించుకుంటున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి తెలుపు దుస్తుల్లోనే కనిపించిన ఆయన మొదటిసారి షర్ట్, ఫ్యాంట్ వేసుకొని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.