ఆ మసీదును కూల్చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!
అలహాబాద్ హైకోర్టులోని మసీదును తొలగించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత పనులను ముగించేందుకు అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చింది కోర్టు. ఈ మసీదు తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ నిర్మాణం ప్రాపర్టీ లీజు రద్దైన ప్రాంతంలో ఉన్నదని స్పష్టం చేసింది. దీన్ని కొనసాగించడం సరికాదని వివరించింది. ఈ కేసులో వక్ఫ్ మసీదు హైకోర్టు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం సుప్రీం తోసిపుచ్చింది.