Wednesday, October 14, 2026

ఇంట‌ర్ ఫెయిలై విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Must Read

ఇంట‌ర్ ఫెయిలైన మ‌న‌స్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్ ప్ర‌థ‌మ‌ సంవత్సరం బైపీసీ పూర్తి చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల్లో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -