Thursday, November 13, 2025

ఉగ్రవాదులపై ఆపరేషన్.. 11 మంది సైనికులు మృతి

Must Read

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఆపరేషన్‌లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారు. అక్టోబర్ 7-8 తేదీల మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ బృందానికి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పాక్ సైనిక మీడియా విభాగం ప్రకటించింది. భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య జరిగిన తీవ్ర కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతోందని సైనిక వర్గాలు తెలిపాయి.
నిషేధిత టీటీపీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లో భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలపై దాడులకు పాల్పడుతోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్‌ఎస్‌ఎస్) డేటా ప్రకారం, 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన ప్రధాన ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక సంఘటనల్లో 221 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే ఈ రెండు ప్రావిన్స్‌లు ఉగ్రవాద దాడులకు తీవ్రంగా గురవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీ కారు బాంబు దాడిపై పాక్ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -