Tuesday, October 21, 2025

వెలుగులోకి ‘గాడిద’ కుంభకోణం

Must Read

అమాయకులను ఆసరాగా చేసుకొని గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ వద్ద గాడిదలు కొంటే లీటర్ పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని నమ్మించింది. స్టార్టప్ పేరుతో ఓ బ్రాంచ్ ని ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించింది. లాభాల పేరుతో యూట్యూబ్ లో ప్రచారం చేసుకుంది. సదరు సంస్థను సంప్రదించిన అమాయకుల నుంచి ట్రైనింగ్ పేరుతో రూ.50వేలు, గాడిదకు రూ.లక్ష, డిపాజిట్ పేరుతో రూ.5లక్షలు వసూలు చేసింది. ఇలా తమిళనాడు, ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. కొద్దినెలలు గాడిద పాలను కొని నమ్మించింది. ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియను ఆపేశారు. దీంతో బాధితులు మోసపోయామని తెలుసుకున్నారు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం దొరకడం లేదని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -