Monday, October 20, 2025

పోలీసుల అదుపులో మ‌ల‌క్‌పేట్ హ‌త్య కేసు నిందితులు

Must Read

మలక్‌పేట్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీపీఐ నేత చందురాథోడ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత విభేదాలే హత్యకు దారితీశాయి. చందురాథోడ్‌తో రాజేష్ అనే వ్యక్తికి భూములపై వివాదాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. కంట్లూర్ పరిధిలో ఈ భూ తగాదాలు కొనసాగినట్టు వెల్లడైంది. అలాగే, వివాహేతర సంబంధాల కోణంలో కూడా విచారణ సాగుతోందని సమాచారం. ఘటన జరిగిన అనంతరం నిందితులంతా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించడంతో పాటు, మొబైల్ టవర్ లొకేషన్లను, సాంకేతిక ఆధారాలను బట్టి వారి పట్ల స్పష్టతకు పోలీసులు చేరుకుంటున్నారు. 10 ప్రత్యేక పోలీసు బృందాలు మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ హత్యకేసుకు రాజకీయ కోణం ఉందా? అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. పరిస్థితి మరోసారి అలా మళ్లకుండేందుకు మలక్‌పేట్‌ పరిధిలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -