Monday, October 20, 2025

విమాన ప్ర‌మాద బాధితుల‌కు మోదీ ప‌రామ‌ర్శ‌

Must Read

అహ్మ‌దాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ బాధితుల‌ను నేడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌రామ‌ర్శించారు. నేడు ఉద‌యం ఆయ‌న ప్ర‌మాద స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. అనంత‌రం స్థానిక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విశ్వాస్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేట్ నుండి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయ‌న‌కు ఆసుపత్రిలో చికిత్స అందుతోంద‌ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్ల‌డించారు. విమానం మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి స‌హా,169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, ఒక్కరు కెనడా వాసులున్నారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్ ప్ర‌క‌టించారు. దీంతో పాటు వారి వైద్య ఖ‌ర్చులు కూడా భ‌రిస్తామ‌న్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -