గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్‌కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ రెండు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ‘ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. ‘ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.