ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రజలపై భారం వేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు ఇచ్చే అప్పులను భవిష్యత్తులో అమరావతి ఆదాయంతో తీరుస్తామన్నారు. అంతేకాని ప్రజలపై భారం వేయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నామంటూ వైకాపా నేతలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించే ఓడరేవులు, ఇతర పరిశ్రమల వద్ద శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మిస్తామన్నారు.