Sunday, May 10, 2026

కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌న్న జీవ‌న్ రెడ్డి

Must Read

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పే దిశగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ మార్పు దాదాపు ఖాయమని సంకేతాలు ఇస్తూ, రేపు ఉదయం 10 గంటలకు తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో జరిగిన భేటీ తర్వాత జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. పార్టీ లోపల తన సమస్యలకు పరిష్కారం దొరకలేదని, ఇప్పుడు తన ముందున్న మార్గం స్పష్టంగా లేదని తెలిపారు.

భేటీ ఫలించలేదు

జీవన్‌రెడ్డిని ఒప్పించేందుకు కాంగ్రెస్ నాయకత్వం చివరి ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు ఏఐసీసీ ప్రతినిధులు ఆయనను కలిసినా, ఆయన తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఆయనను ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో భేటీ ముగిసిన వెంటనే నాయకులు వెళ్లిపోయారు.మూడు రోజుల క్రితమే ఇతర నేతలు కూడా జీవన్‌రెడ్డిని కలసి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఆయన రాజీనామా నిర్ణయం మరింత బలపడినట్టు కనిపిస్తోంది.

40 ఏళ్ల అనుబంధానికి ముగింపు

జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీతో తనకు ఉన్న అనుబంధం ఎంతో బలంగా ఉందని, ఇంతకాలం కలిసి పనిచేసిన తర్వాత ఇప్పుడు విడిపోవడం చాలా బాధగా ఉందన్నారు. రాజకీయ జీవితంలో ఇది తనకు కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -