Sunday, August 31, 2025

కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్

Must Read

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -