మోంథా తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ అతిభారీ వర్షాలు పడతాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్ జనగామ ఖమ్మం కొమురంభీం మంచిర్యాలలో మోస్తరు భారీ వర్షాలు సిద్ధిపేట సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. హైదరాబాద్ లో భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం నాలుగు జిల్లాలకు ఆరెంజ్ 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తుపాను తీరం దాటేటప్పుడు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయి. ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

