Wednesday, October 14, 2026

హరీష్ రావు ఇంట్లో విషాదం.. సీఎం రేవంత్ ఫోన్ కాల్‌!

Must Read

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాద వాతావరణం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం మరణించారు. హైదరాబాద్ క్రిన్స్ విల్లాస్ లో పార్థివ దేహం ఉంచారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సత్యనారాయణతో అనుబంధం గుర్తుచేసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుభూతి ప్రకటించారు. మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -