Wednesday, July 2, 2025

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

Must Read

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం

చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి బయలుదేరారు. ఉదయం 4.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఊపిరాడక చనిపోయారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -