Wednesday, October 14, 2026

కర్నూలు ఆస్ప‌త్రిలోనే బస్సు ప్రమాద మృత‌దేహాలు

Must Read

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో నిద్రలో ఉన్నవారు సజీవ దహనానికి గురయ్యారు. తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మృతదేహాలు పోస్టుమార్టం గదిలో ఉన్నాయి. వైద్యులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటివరకు 19 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించగా, 11 మృతదేహాలకు సంబంధించి బంధువుల నమూనాలను కూడా సేకరించారు. ఈ నమూనాలను మంగళగిరి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మిగిలిన మృతదేహాల బంధువుల నుంచి నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది, దీంతో మృతదేహాల అప్పగింత ఆలస్యం కానుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -