బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు, ప్రజలు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కేటీఆర్‌ను ఆశీర్వదించారు.