Monday, December 9, 2024

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Must Read

కుప్పం, పిఠాపురం పట్టణాలకు మహర్దశ

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ మీటింగ్ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కుప్పం, పిఠాపురం హెడ్ క్వార్టర్లుగా కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం లభించింది. ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేసింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో 2014 నుంచి 2019 మధ్య పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను చెల్లిస్తామని తెలిపింది. పల్నాడు జిల్లాలోని ఆరు మండలాలు, 92 గ్రామాలు… సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం… బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను సీఆర్డీయే పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు పంపేలా నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -